- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచు విష్ణు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్
నిమిషాల షార్ట్ ఫిల్మ్ నుండి ₹10 కోట్ల ఫీచర్ ఫిల్మ్ చేసే అవకాశం కల్పిస్తున్న అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ సీజన్ 1

దిశ, సినిమా : సంక్రాంతి పర్వదినం సందర్భంగా భారతదేశం అంతటా ఔత్సాహిక ఫిల్మ్ మేకర్లను, కొత్త ప్రతిభను కనుగొని ప్రోత్సహించే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ - సీజన్ 1ను ప్రకటించారు. ఈ మేరకు అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ కీలక ప్రకటన చేసింది. రియాలిటీ ఫార్మాట్‌గా రూపొందించబడిన ఈ పోటీ ఆశావహులైన మేకర్లు గరిష్టంగా 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌లను సమర్పించమని ఆహ్వానించింది. ఇవి పూర్తిగా కథ చెప్పడం, దర్శకత్వ దృష్టిపై ఆధారపడి ఉంటాయి.
ఈ పోటీలో గెలుపొందిన దర్శకుడుకి పది కోట్ల ఫీచర్ ఫిల్మ్‌ను తీసే సదావకాశాన్ని నటుడు, నిర్మాత మంచు విష్ణు కల్పించనున్నారు. నూతన ప్రతిభకు నిరంతరం మద్దతు ఇవ్వడంలో ముందుండే విష్ణు మంచు ఈ కార్యక్రమంతో మరో ముందడుగు వేశారు. అర్హులైన దర్శకులను మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి తీసుకు రావడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ ప్రోగ్రాంతో అవా ఎంటర్టైన్మెంట్స్ కొత్త టాలెంట్‌ను, ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు, భారతీయ సినిమా భవిష్యత్తును రూపొందించడానికి విష్ణు మంచుకి ఉన్న నిబద్ధతను చాటి చెబుతుంది.






