- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kannappa trailer: జర్నీ బిగిన్స్ అంటూ బిగ్ అప్‌డేట్ ఇచ్చిన మంచు విష్ణు..
హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa).

దిశ, వెబ్‌డెస్క్: హీరో విష్ణు మంచు(Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’(Kannappa). ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్న మూవీని.. అవా ఎంటర్‌టైన్మెంట్స్(Ava Entertainments), 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్(Mohanlal), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్(Prabhas), శరత్ కుమార్(Sarathkumar), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) వంటి స్టార్ హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్ని అప్‌డేట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ మూవీ జూన్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృదం వరుస అప్‌డేట్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్(Trailer) అప్‌డేట్ ఇస్తూ మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘ఈ నిరీక్షణ నేటితో ముగుస్తుంది.. ప్రయాణం ప్రారంభమవుతుంది.. కన్నప్ప ట్రైలర్ సాయంత్రం 6 గంటలకు విడుదల అవుతుంది.. అంతిమ భక్తి గాథ ఆవిష్కృతమవుతుంది.. హర్‌హర్‌మహాదేవ్’ అని రాసుకొస్తూ ట్రైలర్ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.






