- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పది నిమిషాలు.. పది కోట్లు.. మంచు విష్ణు బంపర్ ఆఫర్
ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు విష్ణు మంచు సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్ కొత్త ఏడాది సందర్భంగా కీలక ప్రకటన చేసింది. ‘ఇండియా వైడ్‌గా ఉన్న కొత్త టాలెంట్, న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ అవా ఎంటర్‌టైన్మెంట్ ఆహ్వానం పలుకుతోంది.

దిశ, సినిమా : ఇండస్ట్రీలో కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు విష్ణు మంచు సాహోసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అవా ఎంటర్‌టైన్మెంట్ కొత్త ఏడాది సందర్భంగా కీలక ప్రకటన చేసింది. ‘ఇండియా వైడ్‌గా ఉన్న కొత్త టాలెంట్, న్యూ జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ అవా ఎంటర్‌టైన్మెంట్ ఆహ్వానం పలుకుతోంది. రూటెడ్ స్టోరీలు చెప్పే విజన్, క్రియేటివిటీ ఉన్న న్యూ మేకర్స్‌ను ఒక చోటకు చేర్చాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఓ పది నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రం కూడా మన జీవితాన్ని మార్చేయగలదు. చిన్నగా ప్రారంభైన ప్రయాణమే గొప్ప స్థాయికి వెళ్లొచ్చు. ఓ గొప్ప సినిమా అనేది దాని స్కేల్ లేదా నేపథ్యం నుంచి కాకుండా.. ఆలోచన, అందులోని స్పష్టత, భావోద్వేగం, సృజనాత్మక నుంచి పుడుతుందని అవా ఎంటర్‌టైన్‌మెంట్ నమ్ముతోంది. ఇది ఒక సాధారణ పోటీ లేదా సాంప్రదాయ లాంచ్ ప్యాడ్ కాదు. పరిశ్రమపై లోతైన అవగాహన, అనుభవం, స్పష్టమైన ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేకమైన అవకాశం’ అని తెలిపింది. మరిన్ని వివరాలను జనవరి 15న అధికారికంగా వెల్లడించనున్నట్లు చెప్పింది.






