కలిసిపోయిన అన్నదమ్ములు.. విష్ణు విషెస్‌కు థ్యాంక్స్ ‘అన్న’ అంటూ మనోజ్ రిప్లై

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-12 11:27:06  IST  )

మంచు విష్ణు, మనోజ్‌ను ‘మిరాయ్’ మూవీ కలిపింది...

కలిసిపోయిన అన్నదమ్ములు.. విష్ణు విషెస్‌కు థ్యాంక్స్ ‘అన్న’ అంటూ మనోజ్ రిప్లై
X

దిశ, వెబ్ డెస్క్: మంచు ఫ్యామిలీ(Manchu Family)లో చెలరేగిన వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆస్తుల విషయంలో మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), విష్ణు(Vishnu), మనోజ్(Manoj) పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురి మధ్య దూరం పెరిగింది. అయితే ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ దగ్గరవుతున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. విష్ణు, మనోజ్ మధ్య గొడవలు తగ్గుతున్నట్లున్నాయి. వివాదాలు పక్కనపెట్టి ఇద్దరు అన్నదమ్ములు దగ్గరవుతున్నారు.

మంచు మనోజ్ నటించిన ‘మిరాయ్’ మూవీ శుక్రవారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో మనోజ్‌తో పాటు ఎంటైర్ చిత్ర బృందానికి మంచు విష్ణు విషెస్ తెలిపారు. తన ఎక్స్‌లో ‘Wishing all the best for #Mirai. God speed to the entire team’ అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు మంచు మనోజ్ స్పందించారు. థ్యాంక్యూ సో మచ్ అన్న(Thank you soo much anna) అంటూ రిప్లై ఇచ్చారు. ‘భక్త కన్నప్ప’ సినిమాకు సంతోషం అవార్డు రావడంపై మంచు విష్ణుకు ఇటీవల మనోజ్ విష్ చేశారు. ఇప్పుడు మంచు విష్ణు కూడా మనోజ్‌కు విష్ చేయడంతో ఇద్దరు అన్నదమ్ముల మధ్య వివాదాలు తగ్గుతున్నాయని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

మంచు విష్ణు ట్వీట్..

మంచు మనోజ్ రిప్లై

Next Story