- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ కారణంగానే కోట చనిపోతే రాలేక పోయాను - మోహన్ బాబు
కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు మంచు మోహన్ బాబు. ఈ సందర్బంగా మంచు మోహన్ బాబు మాట్లాడారు. కోట

దిశ, వెబ్ డెస్క్ : కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు మంచు మోహన్ బాబు. ఈ సందర్బంగా మంచు మోహన్ బాబు మాట్లాడారు. కోట శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు అన్నారు. ఆయన అకాల మరణం రోజు నేను హైదరాబాద్‌లో లేనని పేర్కొన్నారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు. కన్నప్ప రిలీజ్ రోజు ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది.. విష్ణుకు మంచి పేరు వచ్చింది అని అంటున్నారు అని నాతో చెప్పారన్నారు మంచు మోహన్ బాబు.
1987 సంవత్సరంలో "వీరప్రతాప్" అనే సినిమాలో మాంత్రికుడుగా మెయిన్ విలన్‌గా నా బ్యానర్‌లో అవకాశం ఇచ్చానన్నారు. మా బ్యానర్‌లో, బయట బ్యానర్‌లలో మేం కలిసి చాలా సినిమాల్లో నటించామని చెప్పారు. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన గొప్ప నటుడు కోట అని కొనియాడారు. విలన్‌గా, కమెడియన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట అన్నారు మంచు మోహన్ బాబు.
కోట శ్రీనివాసరావు మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు అని చెప్పారు. ఆయన మరణం నా కుటుంబానికే కాకుండా సినిమా పరిశ్రమకు తీరని లోటు అన్నారు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నానని ఎమోషనల్ అయ్యారు మంచు మోహన్ బాబు.






