- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mirai: ఎంత ఫ్రీగా ఉంటే అంత హ్యాపీగా పడుకోవచ్చు.. మనోజ్ కామెంట్స్ ఎవరి గురించి?
యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా నుంచి రీసెంట్‌గా ట్రైలర్ వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ సినిమా నుంచి రీసెంట్‌గా ట్రైలర్ వచ్చిన విషయం తెలిసిందే. 3 నిమిషాల ట్రైలర్‌లో.. ‘తొమ్మిది గ్రంధాలూ వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం.. ఇదే చరిత్ర... ఇది భవిష్యత్తు.. ఇదే మిరాయ్..’ అనే డైలాగ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. అలాగే యాక్షన్స్ సీన్స్, VFX ఎఫెక్ట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తేజ సజ్జా సూపర్ యోధాగా నటిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మంచు మనోజ్, శ్రియ శరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కాబోతుంది.
ఇక ట్రైలర్ ఈవెంట్‌లో ‘తేజాతో మూవీతో చేస్తున్నారు.. హీరోగా సెటిల్ అయిన వాళ్లు నెగిటివ్ రోల్ చేయాలంటే ఆలోచిస్తారు. అంత డేరింగ్‌గా చేసి తేజాను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు.. అంత నిష్కల్మషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని రిపోర్టర్ మంచు మనోజ్‌ను ప్రశ్నించగా.. ‘ఎంత ఫ్రీగా ఉంటే అంత హ్యాపీగా పడుకోవచ్చు. అదొక్కటే నా గోల్. కుళ్లు, ఇన్‌సెక్యూరిటీ ఇలా మనసులో ఏదైన పెట్టుకుంటే అదే మనిషికి ఫస్ట్ విలన్. ఈరోజు టీమ్ అంతా కలిసి వచ్చాము. అందరం కలిసే గెలుస్తాము. ఏదైనా సరే అది కలిసే జరుగుతుంది. అలాగే మూడు ఏళ్లుగా ఇది టీమ్‌లా కాదు.. ఒక ఫ్యామిలీలా ఉన్నాము. సో ప్రేమించు.. ప్రేమ పంచు సింపుల్’ అంటూ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతుండగా.. నువ్వు మావోడివే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. లింక్






