Manchu Manoj: ఆ మూడు సినిమాలు నేను చేయాల్సినవి.. కానీ.. మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్

by Gugulothu.Kavitha |

మంచు మనోజ్(Manchu Manoj) చాలా కాలం తర్వాత సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.

Manchu Manoj: ఆ మూడు సినిమాలు నేను చేయాల్సినవి.. కానీ.. మంచు మనోజ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మంచు మనోజ్(Manchu Manoj) చాలా కాలం తర్వాత సాలిడ్ కం బ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇందులో భాగంగా విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో ‘భైరవం’(Bairavam) సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీలో మనోజ్‌తో పాటు రోహిత్(Nara Rohith), బెల్లంకొండా సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) కూడా నటిస్తున్నారు. అయితే ఎన్నో అంచనాల నడుమ ఈ చిత్రం నేడు థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది.

అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి(Arjun Reddy), రామ్ చరణ్(Ram Charan) ‘రచ్చ’(Racha), నాగ చైతన్య(Naga Chaitanya) ‘ఆటో నగర్ సూర్య’(Autonagar Surya) లాంటి సినిమాలను మిస్ చేసుకున్నా అని తెలిపారు. అప్పట్లో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక, వేరే పరిస్థితుల కారణంగా ఆ సినిమాలు చేయలేకపోయా అని చెప్పాడు మనోజ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. అర్జున్ రెడ్డి సినిమా మనోజ్ చేసి ఉంటే ఇప్పుడు మనోజ్ రేంజ్ మరో లెవల్ లో ఉండేది అని నెటిజన్స్ కామెట్స్ చేస్తున్నారు.

For Link Click Here..

Next Story