- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నప్ప హార్డ్ డిస్క్ పై స్పందించిన మంచు మనోజ్.. అవును మీకే ఇచ్చాను కదా అంటూ సెన్సేషనల్ కామెంట్స్(వీడియో)
టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘కన్నప్ప’(‘Kannappa’).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘కన్నప్ప’(‘Kannappa’). ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కన్నప్ప’ జూన్ 27న థియేటర్స్‌లోకి రానుంది.
ఈ నేపథ్యంలోనే ‘కన్నప్ప’ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ కావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విషయంపై చిత్రబృందం సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే తాజాగా, ‘కన్నప్ప’ప్రమోషన్స్‌లో పాల్గొన్న మంచు విష్ణు.. తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని సంచలన ఆరోపణలు చేశారు. వారే స్వయంగా చేశారా.. ? లేక వారితో ఎవరైనా చెప్పి చేయించారా అన్నది తనకు తెలియదని విష్ణు పేర్కొన్నారు. ఇక దీనిపై తాజాగా మంచు మనోజ్ స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇటీవల ఆయన నటించిన భైరవం సినిమాకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే కన్నప్ప హార్డ్ డిస్క్ మీ దగ్గరే ఉందటగా ? అని ఓ విలేకరి అడగ్గా.. మంచు మనోజ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కన్నప్ప హార్డ్ డిస్క్ పోయింది.. మీకు సంబంధం ఉంది అనే వార్తలు వస్తున్నాయి కదా అని మనోజ్‌ను అడగ్గా.. “నేను మీకే ఇచ్చాను కదా.. మర్చిపోయారా మీరు మొన్న కలిసినప్పుడు ఇచ్చాను కదా” అంటూ సరదాగా ఆన్సర్ ఇచ్చారు. ఒక సినిమా అనేది చాలా మంది కష్టం.. అందుకే తాను కన్నప్ప సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మంచు మనోజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.






