- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Manoj: మంచు మనోజ్ సెన్సేషనల్ పోస్ట్.. బిగ్ స్క్రీన్‌లోకి దొంగప్ప వచ్చేస్తున్నాడంటూ..
మంచు వారింట జరుగుతున్న గొడవలు తెలుగు ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మంచు వారింట జరుగుతున్న గొడవలు తెలుగు ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలు పోలీస్ స్టేషన్, కోర్టు వరకు కూడా వెళ్లాయి. అయితే ఇప్పుడిప్పుడే సద్ధుమణిగిపోతున్నాయకుంటున్న టైంలో తాజాగా మళ్లీ చిచ్చు రాజుకుంది. అయితే మోహన్ బాబు(Mohan Babu)కు సంబంధించిన ఓ ఫామ్ హౌస్ విషయంలో… ఈ వివాదం రాజుకుంటుందని అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన ‘కన్నప్ప’(Kannappa) సినిమాపై మంచు మనోజ్ తాజాగా సెటైరికల్ ట్వీట్ చేశాడు.
‘మీ క్యాలెండర్లలో జూలై 17వ తేదీని మార్క్ చేసుకోండి.. జూన్ 27వ తేదీన బిగ్ స్క్రీన్ లోకి దొంగప్ప వచ్చేస్తున్నాడు’ అంటూ వివాదాస్పద పోస్ట్ చేశారు. అలాగే ఇంతకీ రిలీజ్ జూలై 17వ తేదీన లేక జూన్ 27వ తేదీన అంటూ పేర్కొన్నారు. ఏకంగా 100 కోట్ల బడ్జెట్ సినిమా ప్లానింగ్ కేక అంటూ సోషల్ మీడియాలో మంచు మనోజ్ సెన్సేషనల్ పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.






