Manoj:‘మేము ముగ్గురం నలుగురం అయ్యాం’ అంటూ మనోజ్ పోస్ట్.. కుమార్తె ఫస్ట్ బర్త్డే సందర్భంగా క్యూట్ పిక్స్ పంచుకున్న హీరో

by Kodari Anjali |

టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Manoj:‘మేము ముగ్గురం నలుగురం అయ్యాం’ అంటూ మనోజ్ పోస్ట్.. కుమార్తె ఫస్ట్ బర్త్డే సందర్భంగా క్యూట్ పిక్స్ పంచుకున్న హీరో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటుడు రెండేళ్ల క్రితం భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికతో కలిసి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. 2023 మార్చి 03న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో జరిగిన ఈ వివాహా వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలు హాజరై నూతన దంపతుల్ని ఆశీర్వదించారు.

ఇద్దరికీ ఇది రెండో వివాహమే అని అందరికీ తెలిసిందే. దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల కుమార్తె అయిన మౌనిక రెడ్డికి (Mounika Reddy) ఓ కుమారుడు కూడా ఉన్నాడు. మనోజ్-మౌనిక జంటకు ఓ పండంటి ఆడబిడ్డ జన్మించింది. అయితే నేడు ఈ బుజ్జాయి పుట్టిన రోజు సందర్భంగా మనోజ్ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. భార్య పిల్లలతో కలిసున్న ఫొటోలు పంచుకుని.. వీటికి ఓ క్యాప్షన్ రాసుకొచ్చారు.

‘‘మా ప్రపంచం మరింత మాయాజాలంగా మారింది. మేము ముగ్గురం నలుగురం అయ్యాము. నాలుగు హృదయాలు.. నాలుగు ఆత్మలు. ఒక అచంచలమైన బంధమిది. నాలుగు స్తంభాలు నిటారుగా నిలబడి ఉన్నాయి. ప్రేమ, బలం, శాశ్వతంగా నిర్మించిన కుటుంబం ఇది. దేవసేన శోభా (Devasena Shobha) మా పులి. తను మా జీవితాల్లోకి కాంతి, ధైర్యం, అనంతమైన ఆనందాన్ని తీసుకువచ్చింది.

అమ్మ, నేను, ధైరవ్ అన్నయ్య ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి రక్షిస్తాం. అందమైన కలలతో నిండిన జీవితాన్ని కలిసి నిర్మించుకుందాం. పదాలు ఎప్పటికీ కలిగి ఉండనంతగా మేము నిన్ను ప్రేమిస్తున్నాము. మొదటి దేవ సేనకు మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అంటూ మనోజ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం మనోజ్ కుమార్తె క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story