- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Manchu Manoj: ‘సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది’.. అన్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్(పోస్ట్)

దిశ, సినిమా: గత కొన్ని రోజులుగా మంచు వారి ఫ్యామిలీలో ఫుల్ గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో మోహన్ బాబు(Mohan Babu), మనోజ్(Manoj) ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్న క్రమంలో మోహన్ బాబు ఓ జర్నలిస్ట్‌పై దాడి చేశారు. అయితే ఈ కేసు కోర్టు వరకు వెళ్లడం, గాయపడిన బాధితుడికి నష్టపరిహారం చెల్లించడానికి అతను అంగీకరించడం జరిగింది. ఇక ప్రజెంట్ ఏ గొడవలు లేవు అన్న సమయంలో మంచు మనోజ్ ఇటీవల రంగంపేటలోని యూనివర్సీటికి వెళ్లడంతో మళ్లీ ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో మంచు ఫ్యామిలీ వివాదం మళ్లీ స్టార్ట్ అయింది. ఇక ఈ గొడవ కాస్తా సోషల్ మీడియాకి ఎక్కేసింది.
శుక్రవారం మంచు మనోజ్‌పై ఇండైరెక్ట్‌గా సెటైర్ వేస్తూ విష్ణు.. మోహన్ బాబు రౌడీ(Rowdy) చిత్రంలోని "సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది.. కానీ వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావని ఆశ.." అనే డైలాగ్‌ని పోస్ట్ చేశారు. దీనికి ఇది రౌడీ చిత్రంలోని నాకు బాగా నచ్చిన డైలాగుల్లో ఒకటి. డైరెక్టర్ ఆర్జీవి నా ఫేవరెట్. ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. ఇందులో ప్రతీ డైలాగ్ ఒక స్టేట్‌మెంట్‌యే. మోహన్ బాబు@50 ఏళ్ల సినీ ప్రయాణం.. అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు విష్ణు.
ఇక ఈ ట్వీట్‌కి తాజాగా మంచు మనోజ్ ఘాటు రిప్లయ్ ఇచ్చారు. "కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజు గారిలా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్.. క్లూ (హాలీవుడ్ వెంచర్)" అంటూ డైరెక్ట్ ఎటాక్ చేశారు మనోజ్. ఏకంగా కన్నప్ప సినిమా గురించి చెబుతూ విష్ణుని ట్రోల్ చేశారు. ఇండైరెక్ట్‌గా కన్నప్ప చిత్రం ఏమవుతుందో అందరికీ తెలిసిందే అన్నట్లుగా సెటైర్ వేశారు మనోజ్. ఇప్పుడు వీళ్ల ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు మీ ఫ్రస్టేషన్స్ మాకు ఫన్‌లా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.