ఈ సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్‌కు బెదిరింపు కాల్స్ వస్తాయి.. మనోజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్

by Chukka Sudharani |   (  Updated:2025-11-04 15:11:48  IST  )

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’.

ఈ సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్‌కు బెదిరింపు కాల్స్ వస్తాయి.. మనోజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు కాబోతుండగా.. తాజాగా సినిమా నుంచి 'రాంబాయి నీ మీద నాకు..' లిరికల్ సాంగ్‌ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్, భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు. సాంగ్ రిలీజ్ అనంతరం మనోజ్ మాట్లాడుతూ..

‘నా కెరీర్‌లో 2.O ఈటీవీ విన్‌లో ఉస్తాద్ అనే షో తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత భైరవం, మిరాయ్ లాంటి హిట్ సినిమాలు దక్కాయి. మంచి కంటెంట్‌తో మూవీస్, షోస్ చేస్తూ ఈటీవీ విన్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ కోసం టీమ్ రెండేళ్లుగా కష్టపడుతున్నారు. ఒక పల్లెటూరిలో జరిగిన యదార్ధ ఘటన ఈ సినిమా. జరగకూడని ఘటన అది. ఇటీవల లిటిల్ హార్ట్స్ అనే ఎంటర్ టైనింగ్ మూవీ చేశారు. "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా కూడా లైట్ మూవ్‌మెంట్స్‌తో వెళ్తూ హెవీ ఎమోషన్‌తో పూర్తవుతుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అన్ని అవార్డ్స్ ఈ సినిమాకు వస్తాయి. అంతే కాకుండా.. సినిమా సక్సెస్ మీట్‌కు వచ్చి ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడుతా. ఈ సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్ సాయిలుకు బెదిరింపు కాల్స్ వస్తాయి. అప్పుడు నీకు సపోర్ట్‌గా నేనుంటా. ఇలాంటి పాయింట్‌ను డైరెక్టర్ సినిమాగా చేశాడంటే అతనికి హ్యాట్సాఫ్. ఇలాంటి మంచి సినిమాను థియేటర్స్‌లో చూసి సపోర్ట్ చేయండి’ అని తెలిపాడు మనోజ్.

Next Story