మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన మంచు మనోజ్.. పవన్ కళ్యాణ్ ప్రస్తావనతో సీన్ రివర్స్...

by Sujitha Rachapalli |

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘భైరవం’. విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మూవీ భారీ హైప్ క్రియేట్ చేసింది

మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన మంచు మనోజ్.. పవన్ కళ్యాణ్ ప్రస్తావనతో సీన్ రివర్స్...
X

దిశ, ఫీచర్స్ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘భైరవం’. విజయ్ కనకమేడల డైరెక్షన్‌లో రాబోతున్న ఈ మూవీ భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ మెగా ఫ్యామిలీ గురించి తప్పుగా ట్వీట్ చేశాడన్న కారణంతో బాయ్‌కాట్ ట్రెండ్ నడిచింది. దీనిపై డైరెక్టర్ తన తప్పేమీ లేదని, ఎకౌంట్ హ్యాక్ అయిందని.. అయినా మిమ్మల్ని క్షమాపణలు కోరుతున్నానని పోస్ట్ పెట్టాడు. సారీ చెప్పాడు. అయినా సరే మెగా ఫ్యాన్స్ వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. దీంతో సినిమాకు ఎఫెక్ట్ పడే చాన్స్ ఎక్కువగా ఉంది. ఈ కారణంతో మంచు మనోజ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ తరఫున అపాలజీ చెప్పాడు.

విజయ్ కనకమేడల సినిమాను నమ్ముకున్నాడని.. ఆయన మెగా ఫ్యాన్స్‌లో ఒకడని.. అలాంటి వ్యక్తిని అందరూ టార్గెట్ చేయడం సరికాదన్నారు. తప్పు జరిగిందని చెప్తున్నాడని.. అర్థం చేసుకోవాలని కోరాడు. సక్సెస్‌ఫుల్ సినిమాలు చేస్తున్నా సరే పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసేందుకు వెళ్లాడని.. ఒక్క సీన్ డైరెక్ట్ చేస్తే చాలనే పిచ్చితో పవన్ కోసం పనిచేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా మెగా ఫ్యాన్స్ శాంతించాలని.. డైరెక్టర్ తరఫున మెగా ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు. మీరే ఇండస్ట్రీకి స్ట్రాంగ్ పిల్లర్స్ అని.. సినిమాను నిలబెట్టాలని కోరాడు.

Next Story