- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచు లక్ష్మీ అకౌంట్ హ్యాక్.. దయచేసి ఎవరూ కూడా మనీ సెండ్ చేయకండి అంటూ యంగ్ బ్యూటీస్ పోస్టులు
ఈ మధ్య డిజిటల్ మోసాలు ఎంతగా పెరిగిపోతున్నాయో మనందరికీ తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య డిజిటల్ మోసాలు ఎంతగా పెరిగిపోతున్నాయో మనందరికీ తెలిసిందే. సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ చేసి డబ్బులు రాబడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇక సెలబ్రిటీలను, బడా బిజినెస్ మ్యాన్‌లను టార్గెట్ చేసుకుని హ్యాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి మంచు లక్ష్మీ(Manchu Lakshmi) కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆమె ఇన్ స్టా(Instagram)లో ట్రేడింగ్‌కి సంబంధించిన పోస్టులు దర్శనమిచ్చాయి. ఈయాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చని, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను అని ఆమె ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు హ్యాకర్లు.
ఇక దీనిపై యంగ్ బ్యూటీస్ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), నేహా శెట్టి (Neha Shetty) తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మంచు లక్ష్మి ఇన్‌స్టా గ్రామ్ హ్యాక్ అయింది. దయచేసి ఎవరూ కూడా మనీ పంపకండి అంటూ స్టోరీలు పెట్టారు. అంతేకాకుండా మరో పక్క మంచు లక్ష్మి కూడా తన ఫాలోవర్లను అప్రమత్తం చేశారు. తన అకౌంట్ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్ లకు రిప్లై ఇవ్వొద్దంటూ సూచించారు.
ముఖ్యంగా డబ్బులు కావాలని అడిగితే స్పందించవద్దని తెలిపింది. నాకు డబ్బులు అవసరం అయితే డైరెక్ట్ మిమ్మల్నే అడుగుతాను కానీ ఇలా సోషల్ మీడియాలో అడగను అని చెప్పుకొచ్చింది. అలాగే తన స్టోరీలో కనిపించే పోస్టులను దూరంగా ఉండాలని సూచించింది. ఇన్ స్టాగ్రామ్ రికవరీ అయిన తర్వాత మళ్ళీ ట్వీట్ చేస్తానని ఎక్స్(Twitter)లో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






