- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు భర్తకు దూరంగా ఉండటంపై స్పందించిన మంచు లక్ష్మి.. జనాలు ఏమనుకుంటారో అని ఆలోచించనంటూ షాకింగ్ కామెంట్స్
నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. దీంతో బాలీవుడ్‌లో చాన్స్‌ల కోసం తెగ ఆరాట పడుతోంది. మరి చూడాలి అక్కడ ఎలాంటి ఫేమ్ తెచ్చుకుంటుందో. అయితే ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. నిత్యం నెట్టింట ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ట్రోల్స్‌కి గురౌతూ ఉంటుంది.
అంతేకాకుండా తన హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. అలాగే తన కూతురు యాపిల్(Apple)కి సంబంధించిన ఫొటోలు వీడియోలు సైతం పెడుతుంటుంది. అయితే గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంచు మనోజ్(Manchu Manoj)కి మంచు ఫ్యామిలీకి సంబంధించిన గొడవలు రచ్చకెక్కగా.. ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో దుమారమే లేపింది. ఇప్పుడిప్పుడే ఆ గొడవలు కొంచెం సద్దుమణిగి పోతున్నాయి.
ఇదిలా ఉంటే.. మంచు లక్ష్మి పెళ్లి తర్వాత తన భర్తకు దూరంగా ఉంటుందనే విషయం గురించి నిత్యం నెటిజన్లు చర్చించుకుంటారన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరి మ్యారేజ్ గురించి కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. కానీ ఎప్పుడు ఆమె తన పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. ‘నా భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. ఆయన ఫారెన్‌లో ఐటీ ప్రొఫెషనల్‌గా వర్క్ చేస్తున్నారు. మేము మా వైవాహిక జీవితంలో ఎంతో అన్యోన్యంగా ఉంటాము.
అలాగే.. సమాజంలో ప్రశాంతంగా బతికేలా స్వేచ్ఛను ఇచ్చిపుచ్చుకుంటాము. న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్‌లో జీవిస్తాము. స్వేచ్ఛ, ప్రైవసీ, పర్సనల్ రెస్పాన్సిబులిటీలకు ప్రాధాన్యత ఇస్తాము. మాకు ఎలా అనిపిస్తే అలా బతుకుతున్నాము.. జనాలు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ.. మా పీస్‌ను కోల్పోము. అండ్ ప్రజెంట్ నేను నా భర్తతోనే కలిసి ఉంటున్నాను. అలాగే తన కూతురు ఇప్పుడు భర్త దగ్గర ఉంది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






