- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manchu Manoj: మంచు ఫ్యామిలీ వివాదం.. భయపడే ప్రసక్తి లేదంటూ సెన్సేషనల్ వీడియో విడుదల చేసిన మనోజ్
గత కొద్ది రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నిత్యం మోహన్ బాబు(Mohan Babu), మంచు మనోజ్ ఇరువురి మధ్య కేసులు పెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. జల్‌పల్లిలో ఉన్న వారి ఇళ్లు, ఆస్తుల గురించి మోహన్ బాబు, మంచు మనోజ్(Manchu Manoj) మధ్య వైరం ఏర్పడగా అది కొద్ది రోజుల నుంచి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. అయితే ఇటీవల మంచు మనోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తిరుపతిలోని భాకరాపేట స్టేషన్‌లో పెట్టారు. ఓ సెలబ్రిటీ దట్టమైన అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడం అంత మంచిది కాదని అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
దీంతో ఆయన అర్థరాత్రి నానా హంగామా సృష్టించారు. అంతేకాకుండా వారితో వాదనకు దిగారు. తనను అనచరులను తరచూ వేధింపులకు గురి చేస్తున్నారని మంచి పద్దతి కాదని అన్నారు. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో.. తాజాగా, మంచు మనోజ్ ఓ సెన్సేషనల్ వీడియోను విడుదల చేశాడు. ‘‘గత రెండు నెలలుగా జరుగుతున్న గొడవలు మీరంతా చూస్తున్నారు. అందరూ నన్ను క్షమించండి. ఇదంతా నేను మా స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. వ్యాపారులు చేసుకుంటున్న పని చేసుకుంటున్న ప్రజల కోసం కష్టపడుతున్నాను. అయితే కొంతమంది నన్ను నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అయితే నేను భయపడతానని అనుకుంటున్నారు కానీ అది జరగని పని. నేను తప్పు చేయలేదు.
కానీ మా భార్యభర్తల మీద 34 కేసులు ఉన్నాయి. మా వాళ్ళని కొడుతున్నారు. నేను ఓ ఫంక్షన్‌కు వెళ్లాను. అక్కడ దాడి చేశారు. ఇందులో ఎవరెవరు ఉన్నారో తెలియదు. కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు. అయితే నిన్న రాత్రి తెలిసిన వాల్ల రిసార్ట్‌లో ఉంటే.. అర్ధరాత్రి నేను నా సిబ్బందితో తింటుండగా.. వచ్చారు. పోలీసులు వచ్చి నన్ను స్టేషన్‌కి తీసుకెళ్లారు. మీరంతా ఎందుకిలా చేస్తున్నారు. అయితే నేను వెళ్లి మాట్లాడాను. దయచేసి పోలీస్ స్టేషన్‌లో జరిగిన రికార్డింగ్స్ చూడండి ఏం జరిగిందో తెలుసుకోండి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
#ManchuManoj 😳 pic.twitter.com/nJLlnFgNqN
— Filmyscoops (@Filmyscoopss) February 18, 2025






