- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Manasa Varanasi: మిస్ ఇండియా టైటిల్ గెలిస్తే ఒక్క రూపాయి కూడా రాదు.. అందుకు అదే కారణం.?
మానస వారణాసి మాట్లాడుతూ.. మిస్ ఇండియా లాంటి టైటిల్స్ గెలిచినా కూడా మా చేతికి ఒక్క రూపాయి కూడా అందదు. ఆ సంవత్సరం అయ్యే ఖర్చు మొత్తం మాకు వచ్చిన డబ్బు నుండి ఖర్చు పెడతారు. అందుకే మా చేతికి రూపాయి రాదు అని స్పష్టత ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే వారిలో చాలామంది మోడలింగ్ రంగం నుండి వస్తుంటారు. అక్కడ అద్భుతమైన స్థాయికి చేరుకున్న తర్వాత అనేకమంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అలా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే వారిపై ఒక అపోహ కూడా ఉంటుంది. ఆ రంగంలో కొన్ని టైటిల్స్ ను గెలుచుకున్న తర్వాత వారికి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి ఉంటుందని, దానితో వారికి విలాసవంతమైన జీవితం కూడా ఆ డబ్బు ద్వారా లభిస్తుందని అపోహ పడుతూ ఉంటారు.
అలాంటి వాటికి మిస్ ఇండియా టైటిల్ను గెలిచి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి జోష్‌లో కెరియర్ను కొనసాగిస్తున్న మానస వారణాసి క్లారిటీ ఇచ్చింది. ఈ బ్యూటీ 2020లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయ్యింది. మిస్ ఇండియా వరల్డ్, మిస్ తెలంగాణ 2020 విన్నర్‌గా కూడా నిలిచింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె మొదటగా దేవకి నందన వాసుదేవా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. తాజాగా కపుల్ ఫ్రెండ్లీతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఈ బ్యూటీ మిస్ ఇండియా, మిస్ వరల్డ్ మరియు కొన్ని టైటిల్స్ గెలుపొందినప్పుడు జరిగే పరిస్థితుల గురించి తెలియజేసింది.
మానస వారణాసి మాట్లాడుతూ... "టైటిల్ గెలిచినప్పుడు స్టేజ్ పై మాకు చెక్ అందిస్తారు. కానీ అందులో నుండి మాకు ఒక్క రూపాయి కూడా మాకు అందదు. వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం సంవత్సరం పాటు మా మెయింటెనెన్స్ కి ఉపయోగిస్తారు. హోటల్స్ లలో అయ్యే ఖర్చుకు అలాగే మేకప్, కాస్ట్యూమ్స్, ట్రావెలింగ్, జిమ్, ప్రోగ్రామ్స్, సర్వీసెస్ వంటి వాటికి మాకు ప్రైజ్ మనీగా వచ్చిన డబ్బునే ఖర్చు చేస్తారు. దానితో మేము టైటిల్ విన్నర్ అయ్యాక గెలుపొందిన దాంట్లో మాకు ఒక్క రూపాయి కూడా మిగలదు" అని ఈమె క్లారిటీ ఇచ్చింది.






