- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mana ShankaraVaraPrasadGaru: మరో సాంగ్ వచ్చేస్తోంది..చిరుతో మరో హీరో స్టెప్పులు !
అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమానే మన శంకర వరప్రసాద్ గారు

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చిన హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిన్నచిన్న పాత్రలు చేసి, ఇప్పుడు బడా హీరోగా మారిపోయారు చిరంజీవి. ఆయన ఒక్కడే కాదు, చిరు ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే అలాంటి మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడితో ( Anil Ravi pudi) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమానే మన శంకర వరప్రసాద్ గారు ( Mana ShankaraVaraPrasadGaru).
ఈ జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్న అనిల్, ఇప్పుడు వచ్చే జనవరిలో మెగాస్టార్ చిరంజీవికి మంచి హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా చేస్తుండగా నయనతార ( Nayanthara) కథానాయిక. అంతేకాదు విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన మీసాల పిల్ల సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది. ఇక త్వరలోనే మరో సాంగ్ కూడా ఈ సినిమా నుంచి రిలీజ్ కాదట. అయితే, ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ కూడా స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ సాంగ్ ఓ పబ్బులో ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఒక్క పాట షూటింగ్ పూర్తయితే, ఈ సినిమా మొత్తం ఫినిష్ అయినట్లేనని టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. కాగా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో ప్రస్తుతం సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి, సక్సెస్ కు మారు పేరు. మొన్న జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. అందులో విక్టరీ వెంకటేష్ నటించి, ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే యాంగిల్ లో చిరు సినిమా కూడా ఉంటుందట.






