మన శంకర వరప్రసాద్ గారు మరో రికార్డు.. ఫస్ట్ టైం వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఎంతో తెలుసా?

by Pulgam srinivas |

మన శంకర వరప్రసాద్ గారు చిత్రం కొన్ని రోజుల క్రితం జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మొదటిసారి బుల్లితెరపై ప్రసారం కాగా 14.2 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.

మన శంకర వరప్రసాద్ గారు మరో రికార్డు.. ఫస్ట్ టైం వచ్చిన టీఆర్పీ రేటింగ్ ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతి కానుకగా మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నయనతార ఇందులో హీరోయిన్గా నటించగా, విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ లో కనిపించాడు. హర్ష వర్ధన్, అభినవ్ గోమతం, హర్ష చీముడు తదితరులు ఇందులో ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం టాలీవుడ్ ఆల్ టైం రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత జీ5 ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సంచలనం సృష్టించింది.

కొన్ని రోజుల క్రితం ఈ మూవీ జీ తెలుగు ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం అయింది. ఇక్కడ కూడా ఈ సినిమా రికార్డును సృష్టించింది. మొదటిసారి ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు 14.2 టీఆర్పీ రేటింగ్ను సొంతం చేసుకుంది. రీజనల్ ఫిలిమ్స్ లో ఇది కూడా ఒక సంచలన రికార్డు అని చాలామంది భావిస్తున్నారు. చిరంజీవి స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే రాజకీయాల వైపు దృష్టి మళ్లించి చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.

మళ్ళీ ఖైదీ 'నెంబర్ 150'తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి చిరంజీవి నటించిన సినిమాలలో ఆయన పూర్వపు చిత్రాల మాదిరి స్టైల్, స్వాగ్, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా మన శంకర వరప్రసాద్ చిత్రంలో అద్భుతంగా ఉన్నాయి అని అనేకమంది ఈ చిత్రంలోని చిరంజీవి నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

Next Story