- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరు-వెంకీ.. కలిసి మాస్ స్టెప్స్ వేయనున్న హీరోలు.. సంక్రాంతికి పండగే..
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతికి రాబోతున్నాడు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా నటించబోతున్నారన్న విషయం తెలిసిందే

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతికి రాబోతున్నాడు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా నటించబోతున్నారన్న విషయం తెలిసిందే. కాగా చిరు, వెంకీ కాంబినేషనల్ ఓ మాస్ సాంగ్ ప్లాన్ చేశారు మేకర్స్. పొంగల్‌కు పర్ఫెక్ట్ ఫీస్ట్ రెడీ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన బీట్స్‌తో పర్ఫెక్ట్ డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేయగా.. 500 మంది డ్యాన్సర్లు ఈ పాటలో పాల్గొంటున్నారు. ఈ పాటలో సెట్ ని కలర్, రిథమ్, వైబ్ ల కార్నివాల్ గా మార్చారు. ఇద్దరు స్టార్‌ల కెమిస్ట్రీ, ఎనర్జీ ప్రేక్షకులని అభిమానులను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేయనుంది.
బ్లాక్ బస్టర్ హిట్ మీసాల పిల్లకి కొరియోగ్రఫీ చేసిన పొలకి విజయ్ ఈ పాటకు కూడా కొరియోగ్రఫీ అందించడం విశేషం. మరోవైపు త్వరలోనే చిరంజీవి, నయనతారలపై చిత్రీకరించిన ఒక మెలోడియస్ రొమాంటిక్ సాంగ్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.






