‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్

by Sujitha Rachapalli |

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హైలీ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో భారీ సంచలనంగా నిలుస్తుంది.

‘మన శంకర వర ప్రసాద్ గారు’ ట్రైలర్ రిలీజ్ అప్‌డేట్
X

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హైలీ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో భారీ సంచలనం సృష్టిస్తోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఇక మెగా ఫ్యాన్స్, సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. జనవరి 4న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ.. ట్రైలర్ పోస్టర్‌లో చిరంజీవి తెల్లటి చొక్కా, ముదురు రంగు ప్యాంటు ధరించి, మోకాలిపై కూర్చుని, చేతిలో షాట్‌గన్ పట్టుకుని, చుట్టూ యాక్షన్‌లో ఉన్న వ్యక్తుల మధ్య కనిపించడం అదిరిపోయింది. హై-వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు క్రైమ్ డ్రామా షేడ్స్ కలిగిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మూవీ ఉండబోతుందని తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుండగా, కేథరీన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్న మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది.

Next Story