- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన శంకరవర ప్రసాద్ గారు ఈ సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్
-మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి 'మన శంకర వర ప్రసాద్ గారు' షూటింగ్ పూర్తి, జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు'. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్, దూకుడుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలతో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ రోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు.
'మన శంకర వర ప్రసాద్ గారు' పూర్తి షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం విడుదల కావడం వల్ల, ఈ చిత్రం ఏడు రోజుల లాంగ్ వీకెండ్ బెనిఫిట్ పొందుతుంది. పండుగ సెలవుల పూర్తిగా కలిసిరానున్నాయి. మంచి ప్లానింగ్ తో చేసిన రిలీజ్ టైం సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద సినిమాకు బలమైన వసూళ్లను అందించి, ప్రేక్షకుల రష్ ని గరిష్ఠంగా పెంచుతుందని భావిస్తున్నారు.






