Mana Shankara Vara Prasad Garu: చిరు ఫ్యాన్స్ కు దీపావ‌ళి ట్రీట్

by velandi.Saikiran |

మన శంకర వరప్రసాద్‌గారు ( Mana Shankara Vara Prasad Garu) సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ వదిలింది చిత్రం బృందం

Mana Shankara Vara Prasad Garu: చిరు ఫ్యాన్స్ కు దీపావ‌ళి ట్రీట్
X

దిశ‌, వెబ్ డెస్క్ : దీపావళి కానుకగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు అనిల్ రావిపూడి. దీపావళి పండుగ పర్వదినాన మన శంకర వరప్రసాద్‌గారు ( Mana Shankara Vara Prasad Garu) సినిమా నుంచి అదిరిపోయే పోస్టర్ వదిలింది చిత్రం బృందం. ఇద్దరు చిన్నారులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి సైకిల్ తొక్కుతూ కనిపించిన పోస్టర్ ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మెగాస్టార్ చిరంజీవి స్మార్ట్ లుక్ లో కనిపించారు.

కళ్ళజోడు పెట్టుకొని, మంకీ క్యాప్ టీషర్ట్ ధరించారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. సినిమా మొత్తం ఆ ఇద్దరు చిన్నారుల చుట్టూ తిరిగే అవకాశాలు ఉన్నట్లు అనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటికే మీసాల పిల్ల అనే పాట రిలీజ్ అయి సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.








Next Story