- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mana Shankara Vara Prasad Garu : ఐదో రోజు హవా.. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్..
మెగాస్టార్ చిరంజీవి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఈ సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తోంది.

దిశ, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’.. ఈ సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లను పండుగ వేడుకగా మార్చింది. తెలుగు రాష్ట్రాలలో భారీగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తోంది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 5వ రోజు ఏపీ/తెలంగాణలో పెద్ద సంఖ్యలో వసూళ్లు సాధించింది. గత రికార్డును బద్దలు కొట్టింది. పరిశ్రమలో అత్యధిక 5వ రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. BookMyShowలో కేవలం ఐదు రోజుల్లో 2.5 మిలియన్లకుపైగా టిక్కెట్లు అమ్ముడు కాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 226 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. . అద్భుతమైన మౌత్ టాక్ తో థియేటర్లు హౌస్‌ఫుల్ షోలతో సందడి చేస్తుండగా.. ఆరవ, ఏడవ రోజు నెంబర్స్ కూడా భారీగా ఉండబోతున్నాయి.






