చిరంజీవి "మ‌న శంక‌రవ‌ర ప్ర‌సాద్ గారు" సినిమా మ‌రో రికార్డ్‌

by velandi.Saikiran |

కలెక్షన్స్ లో అరుదైన రికార్డు కొల్లగొట్టింది మన శంకర వరప్రసాద్ గారు సినిమా.

చిరంజీవి మ‌న శంక‌రవ‌ర ప్ర‌సాద్ గారు సినిమా మ‌రో రికార్డ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ( Mana Shankara VaraPrasad Garu). ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ అయి థియేటర్ లో దూసుకు వెళ్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో జనాలకు మరింత నచ్చేసింది. దానికి తోడు విక్టరీ వెంకటేష్ 20 నిమిషాల పాటు ఈ సినిమాలో సందడి చేస్తాడు.

అటు అందాల తార నయనతార కూడా ఇందులో ఇరగదీసింది. మీసాల పిల్ల అంటూ, మెగాస్టార్ చిరంజీవికి చుక్కలు చూపించింది నయనతార. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో మంచి కామెడీని పండించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతి పండుగకు మంచి ట్రీట్ ఇచ్చాడు. దీంతో జనాలు ఎగబడి మరీ ఈ సినిమా చూస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే కలెక్షన్స్ లో అరుదైన రికార్డు కొల్లగొట్టింది మన శంకర వరప్రసాద్ గారు సినిమా. ఈ సినిమా రెండు రోజుల్లోనే నార్త్ అమెరికాలో రెండు మిలియన్ల డాలర్లు క్రాస్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు పోస్ట్ కూడా పెట్టింది. ఇదే దూకుడు మరో వారం రోజుల పాటు కూడా కొనసాగే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

Next Story