- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన డాక్టర్ బాబే..
స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై శరణ్య, సుదీక్ష సమర్పణలో కృతాక్షి నిర్మిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. శ్రీ స్కంద హీరోగా నటిస్తున్న ఈ మూవీని చలపతి కుమార్ పువ్వల తెరకెక్కిస్తున్నారు. మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోయిన్లు.

దిశ, సినిమా : స్కంద ఫిల్మ్స్ బ్యానర్‌పై శరణ్య, సుదీక్ష సమర్పణలో కృతాక్షి నిర్మిస్తున్న చిత్రం ‘మన డాక్టర్ బాబే’. శ్రీ స్కంద హీరోగా నటిస్తున్న ఈ మూవీని చలపతి కుమార్ పువ్వల తెరకెక్కిస్తున్నారు. మోహన సిద్ధి, శృతి శంకర్ హీరోయిన్లు. కాగా న్యూ ఇయర్ స్పెషల్‌గా, హీరో పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తో పాటుగా, గ్లింప్స్‌ని కూడా రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే మాత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో కామెడీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతోందని అర్థం అవుతోంది. చుట్టూ పచ్చదనం, ఆ ఊరి వాతావరణం, క్లినిక్.. అక్కడ పని చేసే డాక్టర్.. అని ఈ గ్లింప్స్‌లో చూపించారు. ఇక సినిమాలో కావాల్సినంత వినోదం ఉంటుందని ఈ గ్లింప్స్‌తోనే చెప్పేశారు. ‘మన డాక్టర్ బాబే’ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా ఉండబోతుండగా.. మనోజ్ కుమార్ బుసం సంగీతాన్ని అందిస్తున్నారు. కెమెరామెన్‌గా కిషోర్ బోయిడాపు, ఎడిటర్‌గా సెల్వ కుమార్ పని చేస్తున్నారు. రాంబాబు గోసాల, గిరిధర్ రాగోలు, విష్ణు యర్రావుల తదితరులు ఈ చిత్రంలోని పాటలకి సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసుకుని ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు మేకర్స్.






