Mamta Mohandas:ఆ ఇద్దరితో ఏదైనా మాట్లాడొచ్చు.. అసలైన స్నేహితులు వారే

by Pulgam srinivas |

మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ... తెలుగులో తారక్, జగపతి బాబు మంచి స్నేహితులని చెప్పుకచ్చింది.

Mamta Mohandas:ఆ ఇద్దరితో ఏదైనా మాట్లాడొచ్చు.. అసలైన స్నేహితులు వారే
X

దిశ, వెబ్ డెస్క్: గాయనిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత మమతా మోహన్ దాస్ నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. ఈమె 2005లో విడుదలైన ‘మయూఖం’ అనే మలయాళ చిత్రంతో నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘యమదొంగ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో మమతా మోహన్ దాస్‌కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈమె అనేక తెలుగు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.

కెరీర్ మంచి జోష్‌లో ముందుకు సాగుతున్న సమయంలోనే ఈమెకు క్యాన్సర్ వ్యాధి రావడంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అయితే ఆ వ్యాధిని జయించి మళ్లీ సినిమాల్లో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తోంది. తాజాగా ఈ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ప్రముఖ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ… తనకు తెలుగు సినిమా పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ మరియు జగపతిబాబు అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. వారు ఎంతో మంచివారు, ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పింది. వారితో మాట్లాడినప్పుడు తన బాధలన్నీ మర్చిపోయి చాలా సంతోషంగా అనిపిస్తుందని వెల్లడించింది.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ, ఆయనను కేవలం గొప్ప నటుడిగానే కాకుండా మంచి విలువలు ఉన్న వ్యక్తిగా భావిస్తానని చెప్పింది. తాను అభిమానించే వ్యక్తుల్లో తారక్ ఒకరని, ఎలాంటి సమస్య వచ్చినా ఆయనతో పంచుకునేంత స్నేహబంధం తమ మధ్య ఉందని తెలిపింది. తమ ఇద్దరికీ సంగీతంపై ఉన్న ప్రత్యేకమైన అభిమానం కారణంగా ఆ స్నేహం మరింత బలపడిందని చెప్పుకొచ్చింది. ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, ఎలాంటి స్వార్థం లేకుండా మాట్లాడే స్వభావం ఆయనదని, అందుకే ఆయనంటే తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని మమతా మోహన్ దాస్ వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story