- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mamitha Baiju: గ్రే లాంగ్ డ్రెస్‌లో క్లాసీ స్టైల్‌తో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ
క్లాస్ స్టిల్స్‌తో ఆకట్టుకున్న మమిత బైజు.

దిశ, వెబ్ డెస్క్: మోస్ట్ బ్యూటిఫుల్ నటి మమిత బైజు 22 జూన్ 2000 సంవత్సరంలో జన్మించింది. ఈమె ప్రముఖంగా మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 2017లో విడుదలైన సర్వోపరి పాలక్కారన్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది.
ఈమెకు 2024లో విడుదలైన ప్రేమలు చిత్రం ద్వారా అద్భుతమైన గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. ఇక కొంతకాలం క్రితం ఈమె డ్యూడ్ అనే చిత్రంతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం ఈమె చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ విజయ్ హీరోగా రూపొందిన 'జన నాయగన్'లో కీలక పాత్రలో నటించింది. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో చాలా విషయాలను పంచుకుంటుంది.
అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రే కలర్ లాంగ్ గౌన్‌లో సింపుల్ అండ్ క్లాసీ స్టైల్‌తో కెమెరా ముందు పోజులు ఇస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈమె ఈ ఫోటోల్లో భారీ స్థాయిలో అందాలను ఆరబోయకపోయినా, చాలా క్లాస్ లుక్‌లో కనిపించడంతో ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Photos Courtesy: Instagram






