- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mamita Baiju: నువ్వు నా జీవితంలోకి వచ్చిన అరుదైన రత్నం అంటూ నటుడికి ఐ లవ్ యు చెప్పిన మమిత.. షాక్‌లో నెటిజన్లు!
యంగ్ హీరోయిన్ మమిత బైజు(Mamita Baiju) ‘ప్రేమలు’(Premalu) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మమిత బైజు(Mamita Baiju) ‘ప్రేమలు’(Premalu) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. తన నటన, అందం, అభినయంతో ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల క్రష్‌గా మారిపోయింది. ఇక ప్రేమలు తర్వాత మిమతకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా నెట్టింట ట్రెండింగ్‌లోకి వచ్చాయి.అయితే మమిల సినిమాల విషయానికొస్తే.. ప్రేమలు-2 చిత్రంతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్’(Jana Nayagan) లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తుండగా.. శృతి హాసన్, ప్రియమణి కూడా కనపించనున్నారు. అయితే ఈ మూవీ విజయ్ చివరి ప్రాజెక్ట్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మమిత సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ నటుడికి బర్త్ డే విషెస్ చెప్తూ ఐ లవ్ యు అని కూడా చెప్పేసింది. ‘‘నా బెస్ట్ బడ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. పోస్ట్ కొంచెం ఆలస్యమైందని నాకు తెలుసు. అయితే సినిమా విడుదలతో మీ పుట్టినరోజు ఎలా ఉండబోతుందో అని మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ మేం మాక్స్‌లో సెలబ్రేట్ చేస్తున్నాం.. నీ గెలుపు నా గెలుపు ఒకటే. ప్రతిసారీ నువ్వు నన్ను ఆశ్చర్యపరుస్తావు! నేను నిన్ను ప్రేమిస్తున్నాను సంగీతెట్టా ఐ లవ్ యు.
అనుకోకుండా సరైన సమయంలో నా జీవితంలోకి వచ్చిన అరుదైన రత్నం నువ్వు! నేను ఎప్పుడూ నీ కోసం ఉంటాను సంగీతెట్టా’’ అని రాసుకొచ్చింది. అలాగే లవ్ ఎమోజీని జత చేసింది. అలాగే అతనితో ఐస్ క్రీమ్ తింటూ, బస్సులో వెళ్తూ, టీ తాగుతూ కనిపించింది. ప్రస్తుతం మమిత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది చూసిన వారంతా ప్రేమలో ఉన్నట్లు హింట్ ఇచ్చిందని చర్చించుకుంటున్నారు. అలాగే కొంతమంది కుర్రాళ్లకు హార్ట్ బ్రేక్ అయిందనడంలో అతిశయోక్తి లేదు. ఆమె అందానికి ఫిదా అయిన వారంతా మమితతో ప్రేమలో పడిపోయారు. ఇక ఈ విషయం తెలుసుకుని బాధపడుతున్నారు. అయితే అతను ఆమె బెస్ట్ ఫ్రెండ్ అని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.






