Mamitha Baiju : 'ఎల్లమ్మ'లో హీరోయిన్‌గా మమితా బైజు?

by Pulgam srinivas |   (  Updated:2026-05-27 07:37:33  IST  )

'ఎల్లమ్మ' చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సరసన మమితా బైజు హీరోయిన్‌గా కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Mamitha Baiju : ఎల్లమ్మలో హీరోయిన్‌గా మమితా బైజు?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాగుతున్న దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘బలగం’ వేణు దర్శకత్వం వహించనుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలమే అయినప్పటికీ, రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. హీరోయిన్ ఎంపిక ఆలస్యం కావడమే షూటింగ్ వాయిదాకు ప్రధాన కారణమని గతంలో వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించినట్లు, అందులో భాగంగా కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ వంటి పలువురు హీరోయిన్లను సంప్రదించినా వారు ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్లు ప్రచారం జరిగింది.

దీంతో చిత్రబృందం హీరోయిన్ ఎంపికపై దృష్టి పెట్టినట్లు అదే కారణంతో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని టాక్ వినిపించింది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వరుస అవకాశాలతో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న మమితా బైజును ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆమెతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘ఎల్లమ్మ’ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సరసన మమితా బైజు హీరోయిన్‌గా కనిపించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Next Story