Narivetta: తెలుగులోకి మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్

by Chukka Sudharani |   (  Updated:2025-08-01 04:40:36  IST  )

మలయాళ హీరో టోవినో థామస్ (Tovino Thomas) నటించిన లేటెస్ట్ మూవీ ‘నరివెట్ట’ (Narivetta).

Narivetta: తెలుగులోకి మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ.. ఆకట్టుకుంటోన్న ట్రైలర్
X

దిశ, సినిమా: మలయాళ హీరో టోవినో థామస్ (Tovino Thomas) నటించిన లేటెస్ట్ మూవీ ‘నరివెట్ట’ (Narivetta). అనురాగ్ మనోహర్ (Anurag Manohar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2000ల ప్రారంభంలో వయనాడ్‌లో జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందింది. ఇప్పటికే ఈ చిత్రం మలయాళం(Malayalam)లో విడుదలై విమర్శలకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు(Telugu)లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. తాజాగా ‘నరివెట్ట’ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌(Trailer)ను విడుదల చేశారు. ‘మలయాళ బాక్సాఫీస్ సెన్సేషన్ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది’ అనే క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసిన ఈ ట్రైలర్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా.. ‘నరివెట్ట’ చిత్రం మే 30న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్దంగా ఉంది.

Next Story