Avihitham OTT: కుర్రాడితో ఆంటీ అక్ర‌మ సంబంధం..అర్ధ‌రాత్రి కాగానే బాత్రూంలో !

by velandi.Saikiran |   (  Updated:2025-12-23 15:51:35  IST  )

అవిహితం ( Avihitham) సినిమా ఒకటి. ఓ మహిళ అక్రమ సంబంధం చుట్టూ తిరిగే ఈ కథ, జనాలకు

Avihitham OTT: కుర్రాడితో ఆంటీ అక్ర‌మ సంబంధం..అర్ధ‌రాత్రి కాగానే బాత్రూంలో !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఈ మధ్యకాలంలో చిన్న బడ్జెట్ తో వచ్చి, పెద్ద హిట్ లో సాధిస్తున్నాయి మలయాళ సినిమాలు. అలాంటి వాటిలో అవిహితం ( Avihitham) సినిమా ఒకటి. ఓ మహిళ అక్రమ సంబంధం చుట్టూ తిరిగే ఈ కథ, జనాలకు బాగా నచ్చింది. దీంతో థియేటర్ లో కంటే ఈ సినిమాకు ఓటీటీలో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. సెన్నా హెగ్డే ( Senna Hegde ) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అంబరీష్ కలతేరా రైట‌ర్ గా ప‌ని చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ అవిహితం మలయాళం సినిమా అక్టోబర్ 10 వ తేదీన రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

జియో హాట్ స్టార్ ( Jio Hotstar) ఈ సినిమా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇందులో వేణుగా ఉన్ని రాజ్ నటించగా నిర్మలాగా వృందా మీనన్ ( Vrinda Menon ) అందరిని ఆకట్టుకున్నారు. వినీత్ వినోద్ గా చేయగా, మురళీగా ధ‌ణేష్ నటించారు. అయితే ఈ సినిమాలో నిర్మల అక్రమ సంబంధం పెట్టుకుందని వేణు బృందం అనుమానిస్తూ ఉంటుంది.

దానికి తగ్గట్టుగానే ఓ అమ్మాయి నిత్యం, అదే ఊరుకు చెందిన ఓ కుర్రాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. అర్ధరాత్రి కాగానే ఈ జంట‌ నిర్మలకు సంబంధించిన బాత్రూంలో దూరి, ఆ పని కానిచ్చేస్తారు. ఇక ఆ జంట‌ను రెడ్ హ్యండెడ్ గా ప‌ట్టుకునేందుకు వేణు టీం ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటుంది. ఇలా సినిమా మొత్తం దాదాపు 106 నిమిషాల పాటు నడుస్తుంది. అక్రమ సంబంధం చుట్టూ ఈ కథ తిరిగిన నేపథ్యంలో జనాలు ఎగ‌బ‌డి ఈ మూవీని ఓటీటీలో ( Jio Hotstar) చూస్తున్నారు.

Next Story