Malavika Nair: స్టైలిష్ బ్లూ కలర్ డ్రెస్‌లో చూపు తిప్పుకోనీయని అందం ఆమె సొంతం

by Pulgam srinivas |

నీలి గౌన్‌లో స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకున్న మాళవిక నాయర్.. ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన బ్యూటీ

Malavika Nair: స్టైలిష్ బ్లూ కలర్ డ్రెస్‌లో చూపు తిప్పుకోనీయని అందం ఆమె సొంతం
X

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ మాళవిక నాయర్ తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. 1998 మే 4న ఢిల్లీలో జన్మించిన ఈమె కొచ్చిలో పెరిగింది.




ఈ బ్యూటీ మోడలింగ్ రంగంలో కూడా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 'బ్లాక్ బటర్ ఫ్లై' చిత్రంతో బాలనటిగా వెండితెరకు పరిచయం అయిన ఈమె, 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.




ఆ తర్వాత 'కల్యాణ వైభోగమే', 'మహానటి', 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా ఈమె శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఏప్రిల్ 3న విడుదల చేయనున్నారు.




దాంతో ఈ చిత్ర బృందం పలు ఈవెంట్లను నిర్వహిస్తుండగా, వాటికి ఈ ముద్దుగుమ్మ కూడా హాజరవుతోంది. ఇటీవల ఈ మూవీ మేకర్స్ ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్‌కు మాళవిక నాయర్ నీలి రంగు స్లీవ్‌లెస్ గౌన్‌ ధరించి విచ్చేసింది.




ఈ స్టైలిష్ లుక్‌ ఉన్న డ్రెస్లో ఆమె తన అందాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాంతో ఈ ఈవెంట్‌కు సంబంధించిన మాళవిక నాయర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Next Story