Malavika Mohanan: ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్

by Chukka Sudharani |

Malavika Mohanan: ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హృదయపూర్వం’ (Hrudayapurvam) ఒకటి. మోహన్ లాల్ (Mohan Lal) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ అంతికాడ్ (Satyan Antikad) దర్వకత్వం వహిస్తున్నాడు. ఇందులో మాళవిక మోహనన్ హీరోయిన్ కాగా.. బసితా జోసెఫ్ (Basita Joseph), సాంగీత్, సంగీత తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక రీసెంట్‌గా ఈ సినిమా చిత్రీకరణ కూడా పూర్తి కావడంతో వరుస ఇంటర్వ్యూస్ ఇస్తూ సందడి చేస్తుంది మాళవిక.

ఈ క్రమంలోనే ‘హృదయపూర్వం’ షూటింగ్ (Shooting) పూర్తి కావడంపై ఆమె స్పందిస్తూ.. ‘చాలా రోజుల తర్వాత నేను నటించిన మలయాళ చిత్రమిది. ఈ సినిమా షూట్ మూడు రోజుల క్రితమే పూర్తైంది. నిజం చెప్పాలంటే ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ‘హృదయపూర్వం టీమ్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌ను నేను ఎంతో మిస్ అవుతున్నాను’ అని తెలిపింది. కాగా.. ‘హృదయపూర్వం’ సినిమా షూటింగ్ పూర్తైనప్పటికీ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు.

Next Story