- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నగర అమ్మాయిని కాదు కానీ నా మనసు ఎప్పుడూ నీతోనే ఉంటుంది’.. నటి పోస్ట్ వైరల్
2013లో మలయాళం సినిమా ‘పట్టం పోల్’ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి మళవిక మోహనన్.

దిశ, వెబ్‌డెస్క్: 2013లో మలయాళం సినిమా ‘పట్టం పోల్’ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది నటి మళవిక మోహనన్. మలయాళం సినిమాలతో పాటు ఈ హీరోయిన్ తెలుగు, తమిళం, హిందీ భాషా సినిమాల్లో కూడా నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. నిర్ణయకం, నాను మట్టు వరలక్ష్మి బియాండ్ ది క్లౌడ్స్, ది గ్రేట్ ఫాదర్, పేట, మాస్టర్, మారన్, యుధ్ర వంటి సినిమాల్లో నటించి.. నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020లో 5వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం మాళవిక మోహనన్ ది రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో అవకాశం దక్కించుకుని ఈ అమ్మడు రేంజ్‌ను మరింత పెంచుకోనుందో చూడాలి.
ఇకపోతే ఈ బ్యూటీ షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ నెట్టింట ఏదో ఒక పోస్ట్ పెడుతూ.. అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో అద్భుతమైన ఫొటోలు పంచుకుని.. ‘నేను నగర అమ్మాయిని కాదు కానీ నా మనసు ఎప్పుడూ నీతోనే ఉంటుంది. బ్యాంకాక్’ అని తెలుపు రంగు లవ్ సింబల్ జోడించింది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ సోషల్ మీడియాలోని జనాల్ని ఆకట్టుకుంటుంది.






