‘పాకెట్ నోవెల్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన మాళవిక మోహనన్.. పోస్ట్‌తో కన్ఫర్మ్ చేసిన బ్యూటీ

by Mallepaka Hamsa |

ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్‌లో హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా అడుగుపెట్టింది. ఈ విషయాన్ని మాళవిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

‘పాకెట్ నోవెల్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన మాళవిక మోహనన్.. పోస్ట్‌తో కన్ఫర్మ్ చేసిన  బ్యూటీ
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ మాళవిక వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ స్టార్ హీరోల సరసన లక్కీ చాన్స్ కొట్టేస్తున్నారు. ఇటీవల ‘ది రాజాసాబ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం విలక్షణ దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో రాబోతున్న ‘పాకెట్ నోవెల్’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన ‘సూపర్ డీలక్స్’ వంటి కల్ట్ క్లాసిక్ హిట్ తర్వాత విజయ్ సేతుపతి, దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజా కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది కావడంతో ప్రకటన రోజు నుంచే అందరిలోనూ ఆసక్తి మొదలైంది.

టైలర్ డర్డెన్ అండ్ కింగ్ ఫిస్ట్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని, షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్‌లో హీరోయిన్ మాళవిక మోహనన్ కూడా అడుగుపెట్టింది. ఈ విషయాన్ని మాళవిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. షూటింగ్ సెట్స్‌లో దర్శకుడు త్యాగరాజన్ కుమారరాజాతో కలిసి దిగిన ఒక ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేసింది. ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడితో కలిసి పని చేయడం సంతోషంగా ఉందంటూ పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా సంగీతం అందిస్తుండగా.. కన్నడ స్టార్ రాజ్ బి. శెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నారు.

Next Story