- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇద్దరు హీరోయిన్లు, ప్రభాస్ ను కూడా డామినేట్ చేస్తున్న అందాల తార !
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ ( The RajaSaab ). మారుతి ( Maruthi) దర్శక

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ ( The RajaSaab ). మారుతి ( Maruthi) దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్ కు సిద్ధంగా ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై... టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు ఈ మధ్య చిత్ర బృందం ప్రకటించింది. అయితే తాజాగా ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ.. చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. ఈ సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. రేపు ఉదయం 10:52 గంటలకు ది రాజాసాబ్ టీజర్ ( The RajaSaab Teaser) రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఈ తరుణంలో టీజర్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్లు.. ఎంతో భయపడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.
ఈ నేపథ్యంలోనే ముగ్గురు హీరోయిన్ల హవా భావాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో మాళవిక మోహనన్ ( Malavika Mohanan) ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. నిధి అగర్వాల్, రిద్ది కుమార్ ఇద్దరితో పాటు ప్రభాస్ ను కూడా ఈ సినిమాలో... మాళవిక మోహనన్ డామినేట్ చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.






