సత్యదేవ్ ‘సమవర్తి’ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్.. దేనికైనా చావే కావాలంటూ హైప్

by Chukka Sudharani |

సత్యదేవ్ నటిస్తున్న ‘సమవర్తి’ సినిమా నుంచి షూటింగ్ సన్నివేశాలు పంచుకుంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

సత్యదేవ్ ‘సమవర్తి’ నుంచి మేకింగ్ వీడియో రిలీజ్.. దేనికైనా చావే కావాలంటూ హైప్
X

దిశ, సినిమా: వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్.. నటిస్తున్న సరికొత్త చిత్రం ‘సమవర్తి’. తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ 16వ చిత్రాన్ని రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్‌పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ‘బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి’ అనే పేరుతో మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. విష సర్పాలు, క్రూర మృగాలు ఉన్న ప్రమాదకరమైన అడవుల్లో ‘సమవర్తి’ షూటింగ్ ఎంత సాహసోపేతంగా చేశారో ఈ గ్లింప్స్‌లో కనిపిస్తోంది. సౌతిండియాలోని 7 అరణ్య ప్రాంతాల్లో, ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని 42 లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ చేయడం విశేషం. 'సృష్టికైనా, వినాశనానికైనా ఒక పిలుపు రావాలి, ఒక పోరాటం పుట్టాలి, ఒక చిన్న యుద్ధం జరగాలి..' అంటూ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్‌లో 'ఇక్కడ స్వర్గానికైనా చావే కావాలి తమ్ముడు..' అనే హుక్ లైన్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రంతో సత్యదేవ్ పూర్తిగా కొత్త జోన్‌లోకి అడుగుపెడుతూ, ఫుల్-ఫ్లెడ్జ్డ్ యాక్షన్ స్పేస్ వైపు గేర్ మార్చారు. ఇక ఇందులో దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story