The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. దేశాన్ని షేక్ చేయడానికి సిద్ధం అంటూ టీమ్ ట్వీట్

by Chukka Sudharani |   (  Updated:2025-10-08 11:18:40  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ది రాజాసాబ్’.

The Rajasaab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. దేశాన్ని షేక్ చేయడానికి సిద్ధం అంటూ టీమ్ ట్వీట్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘ది రాజాసాబ్’. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకోగా.. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్నో వాయిదాల తర్వాత ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతున్నది. దీంతో షూటింగ్‌లో వేగం పెంచిన చిత్ర బృందం.. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేస్తూ ‘దేశాన్ని షేక్ చేయడానికి 2 చార్ట్‌బస్టర్ పాటలను రూపొందించడానికి ది రాజాసాబ్ బృందం కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది’ అంటూ షేర్ చేసిన పోస్టర్ ప్రజెంట్ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తుంది. ఇక అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే కావడంతో ఆ రోజు ఈ సాంగ్‌కు సంబంధించిన అప్డేట్స్ ఇస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. కాగా.. సంజయ్ దత్, అనుపమ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story