- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మండాడి’ సినిమా నుంచి వైల్డ్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్.. షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చిన ఇద్దరు హీరోలు
కోలీవుడ్ నటుడు సూరి(suri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు సూరి(suri) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక హీరోగా మారిన సూరి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘మామన్’ మూవీలో నటిస్తున్న ఆయన ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. దీంతో పాటు ‘మండాడి’(Mandaadi )లోనూ నటిస్తున్నాడు. దీనికి ‘సెల్షి’ చిత్రం ఫేమ్ మతిమారన్ పుగళేంది(mathimaran pugazhendhi) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్‌లో 16వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. ఎల్‌రెడ్ కుమార్ నిర్మిస్తున్నారు.
ఇందులో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్, సచ్చనా నమిదాస్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఉత్కంఠభరితమైన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
తాజాగా, మూవీ మేకర్స్ ‘మండాడి’ తెలుగు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో సురితో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్(Suhas) కూడా ఉన్నాడు. వీరిద్దరు గుబురు గడ్డం జుట్టుతో సముద్రంలో ఒకరిపై ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసుకుంటూ కనిపించిన లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందులో సుహాస్ వేసుకున్న టీషర్ట్‌పై సునామీ రైడర్స్ అని రాసి ఉంది. ఇక ఈ పోస్టర్‌కు ‘‘మీ పోరాట స్ఫూర్తిని మేల్కొల్పడానికి ఒక సునామీ చాలు. ‘మండాడి’ సినిమా అద్భుతమైన తెలుగు ఫస్ట్ లుక్ ఇదిగో. సముద్రాన్ని పాలించడానికి సూరి, సుహాస్ సిద్ధంగా ఉన్నారు’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






