- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kamsahamnida అంటే ఏమిటి.. చిన్న ప్రోమోతో ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
అసలు ఈ Kamsahamnida అంటే ఏమిటి? రేపు తెలుసుకోండి అటూ కొరియన్ కనకరాజు అప్డేట్ ఇచ్చిన మేకర్స్.

దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం హర్రర్, కామెడీని రిఫ్రెషింగ్ క్రాస్-కల్చరల్ ట్విస్ట్‌తో తెరకెక్కుతోంది. ఇండియన్, కొరియన్ నేపథ్యాలలో రూపొందుతున్న ఈ మూవీలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు ఎన్నడూలేని భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫైనల్ దశలో ఉండగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘Kamsahamnida.. Kamsahamnida.. Kamsahamnida.. అసలు ఈ Kamsahamnida అంటే ఏమిటి??? సరికొత్త రీతిలో రేపు ఏప్రిల్ 9 ఉదయం 11:07 గంటలకు దీని గురించి తెలుసుకోండి’ అంటూ కొరియన్ భాషలో ఓ చిన్న వీడియో క్లిప్‌ను రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఇది నెట్టింట వైరల్ అవుతున్నది. కాగా.. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కొరియన్ కనకరాజు’ టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే అద్భుతమైన స్పందనను అందుకుంది. స్టైలిష్ ప్రెజెంటేషన్, ఎంటర్టైనింగ్ టోన్‌తో వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అవ్వగా సినిమాపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రానికి సంగీతం ఎస్. తమన్ అందిస్తుండగా.. త్వరలోనే రిలీజ్ డేట్‌ని ప్రకటించడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.






