Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ నుండి హీటెక్కించే ట్రాక్ రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్.. హాట్ బ్యూటీ పోస్టర్ అవుట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-26 06:30:09  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహరవీరమల్లు’(Hari Hara Veera Mallu).

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ నుండి హీటెక్కించే ట్రాక్ రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్.. హాట్ బ్యూటీ పోస్టర్ అవుట్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరిహరవీరమల్లు’(Hari Hara Veera Mallu). ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi), జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. అయితే ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలె ఎ. దయాకర్ రావు దీనిని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్(Nidhi Agarwal) నటిస్తుండగా.. పూజా పొన్నాడ, బాబీ డియోల్(Bobby Deol), సత్య రాజ్, నర్గీస్ ఫక్రీ, విక్రమ్ జీత్ విర్క్, నాజర్, నోరా ఫతేహి, అనసూయ(Anasuya) కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరీ ముఖ్యంగా పవన్ అభిమానులు ఈ చిత్రం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆస్కార్ విన్నర్ ఎమ్ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జూన్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. అయితే ముందుగా పాటలతో మ్యూజికల్ జర్నీ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ మూవీనుంచి మూడు పాటలు విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక ఈ సారి ట్రైలర్ వస్తుందని అంతా భావించారు. కానీ చిత్రబృందం మాత్రం ‘హరిహరమల్లు’ నుంచి నాలుగో పాట రాబోతున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ అదిరిపోయే పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. కానీ ఇదివరకు లాగా ఈ సారి మెలోడి పాట కాకుండా హాటెస్ట్, సిజ్లిలింగ్ సింగిల్ ‘తారాతారా’ మే 28న ఉదయం 10:20 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే నిధి అగర్వాల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో ఈ భామ రెడ్ కలర్ డ్రెస్ ధరించి తలలో ఓ ఎర్రటి పువ్వు పెట్టుకుని ఎద అందాలు, థైయ్స్ చూపిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టేలా చేస్తోంది. ఇక ఈ సాంగ్ అందరిలో హీట్ పుట్టించడం ఖాయం అని మూవీ మేకర్స్ పోస్టర్‌తోనే హింట్ ఇచ్చేశారు. ఇక అది చూసిన వారు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. పోస్టర్ మాత్రం అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

Next Story