Sharwa36: స్పెషల్ డే నాడు.. స్పెషల్ ప్రకటన.. శర్వా-36 నుంచి అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Chukka Sudharani |

చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Sharwa36: స్పెషల్ డే నాడు.. స్పెషల్ ప్రకటన.. శర్వా-36 నుంచి అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక దీంతో పాటు ‘శర్వా-36’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. మోటార్‌సైకిల్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తుండగా.. మాల్వికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అప్డేట్ వచ్చింది. ‘ఒక ప్రత్యేక రోజున.. స్పెషల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నది. దీపావళి శుభ సందర్భంగా Sharwa36 టైటిల్‌ను ప్రకటించబోతున్నారు’ అని ఓ పోస్టర్ షేర్ చేశారు. ఇందులో శర్య ఓ బైక్ రేసర్‌గా కనిపిస్తుండగా.. ప్రజెంట్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతుంది. లింక్


Next Story