నవ దళపతి ‘జటాధర’ నుంచి డబుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు(Sudheer Babu) నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’(Jatadhara). వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

నవ దళపతి ‘జటాధర’ నుంచి డబుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు(Sudheer Babu) నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’(Jatadhara). వెంకట్ కళ్యాణ్(Venkat Kalyan) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. దీనిని జీ స్టూడియోస్(Zee Studios) బ్యానర్‌పై ప్రేరణఅరోరా, శివిన్ నారంగ్, రాజీవ్ అగర్వాల్, అరవింద్ అగర్వాల్(Arvind Agarwal), నిఖిల్ నందా, మోనేష్, ఉమేష్ కెఆర్ బన్సాల్(Umesh KR Bansal) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుందని సమాచారం.

అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, చరిత్ర ఇలా అనేక అంశాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అక్కడ నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర పురాణ కథలను కూడా ఇందులో భాగం చేయబోతున్నారట. అయితే ఈ సినిమా కోసం సుధీర్ బాబు బాడీ పెంచే పనిలో పడ్డారు. ఇందుకోసం కఠినమైన శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ మేకర్స్ ‘జటాధర’(Jatadhara) నుంచి డబుల్ అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫిబ్రవరిలో జరుగుతుంది మూడు భాషల్లో విడుదల కానున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఓ ఆలయం ముందు సుధీర్ నిలుచుని ఉండగా.. వెనకాల ఏదో దెయ్యం ఆకారంలో భయకరమైన కళ్లతో ఉంది. అలాగే బంగారం వస్తువులు, పుర్రెలు అక్కడ పడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ(Curiosity) పెంచుతోంది. ఇక దీనిని చూసిన వారు గూస్ బంప్స్ వస్తున్నాయి అని కామెంట్లు పెడుతున్నారు. ‘జటాధర’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.

Next Story