రవితేజ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన మేకర్స్.. ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్ విడుదల

by Mallepaka Hamsa |

విడుదలైన గ్లింప్స్‌లో తండ్రీ కూతురు బంధాన్ని అద్భుతంగా చూపించి ప్రేక్షకులను కట్టిపడేశారు. 1:24 సెకండ్లు ఉన్న ఈ గ్లింప్స్‌కు జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన సంగీతం అదిరిపోయింది.

రవితేజ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన మేకర్స్.. ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్ విడుదల
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. ఇందులో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్‌గా కనిపించనుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొనగా.. తాజాగా, చిత్రబృందం మరో అప్డేట్ ఇచ్చి అంచనాలను మరింత పెంచారు. రవితేజ అభిమానులకు ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్‌తో అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. విడుదలైన గ్లింప్స్‌లో తండ్రీ కూతురు బంధాన్ని అద్భుతంగా చూపించి ప్రేక్షకులను కట్టిపడేశారు. 1:24 సెకండ్లు ఉన్న ఈ గ్లింప్స్‌కు జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన సంగీతం అదిరిపోయింది. హృదయాలకు హత్తుకునేలా ఉన్న ఈ ట్యూన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఇందులో తన కూతురితో రవితేజ సంతోషంగా గడుపుతున్న సమయంలోనే ఓ కీలక పరిణామం చోటుచేసుకోగా.. తన కూతురు మందు మానేయమని అడుగుతుంది. దీంతో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా మారిపోతాడు. ది హార్ట్ ఇరుముడి పేరుతో విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మైమరిపిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టులో థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


Next Story