‘ది ప్యారడైజ్’ మూవీ హక్కులను రూ.110 కోట్లకు దిల్ రాజ్ కొనడంపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 110 కోట్లకు సొంతం చేసుకున్నారంటూ గట్టిగా ప్రచారం సాగుతోంది.

‘ది ప్యారడైజ్’ మూవీ హక్కులను రూ.110 కోట్లకు దిల్ రాజ్ కొనడంపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. షూటింగ్ ప్రారంభించి చాలా రోజులే అవుతున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. దీంతో ఈ మోస్ట్ అవేటెడ్ మూవీపై పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా, ఈ సినిమా థియేట్రికల్ పంపిణీ హక్కులను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 110 కోట్లకు సొంతం చేసుకున్నారంటూ గట్టిగా ప్రచారం సాగుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడంతో తాజాగా మూవీ మేకర్స్ దీనిపై స్పందించి అసలు నిజం వెల్లడించారు. సినిమా థియేట్రికల్ హక్కుల గురించి బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, ఆ వదంతులను ఎవరూ నమ్మవద్దని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా కోరింది. సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ అయినా సరే, తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే స్వయంగా ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

దీంతో ఈ బిజినెస్ రూమర్స్‌కు ఒక ఎండ్ కార్డ్ పడినట్లయింది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ భారీ యాక్షన్ డ్రామాలో నాని సరసన కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు, రాఘవ జుయల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story