ఉస్తాద్ భగత్ సింగ్: సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. ఈసారి అంతకు మించి

by Pulgam srinivas |

'ఉస్తాద్ భగత్ సింగ్'లోని సెకండ్ సింగిల్ అయిన 'ఆరా ఆఫ్ ఉస్తాద్'ను ఫిబ్రవరి 22వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఉస్తాద్ భగత్ సింగ్: సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. ఈసారి అంతకు మించి
X

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మార్చి 26వ తేదీన ఈ మూవీని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలుపెట్టారు.

కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రం నుండి దేఖ్ లేంగే సాలా అంటూ సాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ పాట సక్సెస్ కావడంతో పవన్ అభిమానులు ఈ చిత్రం నుండి రెండో సాంగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆత్రుతగా చూడడం మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలోని రెండవ సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ను ప్రకటించింది. ఈ చిత్రంలోని 'ఆరా ఆఫ్ ఉస్తాద్' అంటూ సాగే రెండవ పాటను ఫిబ్రవరి 22వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ ప్రకటనను తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ చాలా యూనిక్గా ఉంది. దానితో ఈ సాంగ్ అద్భుతమైన రీతిలో జనాలను ఆకట్టుకుంటుందని పవన్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. పవన్, హరీష్ కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ చిత్రంపై పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

Next Story