Sundeep Kishan: ఆ పండుగ స్పెషల్‌గా రాబోతున్న ‘మజాకా’.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ (ట్వీట్)

by Mallepaka Hamsa |

హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ‘మజాకా’(Majaka) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సందీప్ సరసన రీతు వర్మ(reethu Varma) హీరోయిన్‌గా నటిస్తోంది.

Sundeep Kishan: ఆ పండుగ స్పెషల్‌గా రాబోతున్న ‘మజాకా’.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్ (ట్వీట్)
X

దిశ, సినిమా: హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan) ‘మజాకా’(Majaka) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సందీప్ సరసన రీతు వర్మ(reethu Varma) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే సీనియర్ యాక్టర్ రావు రమేష్(rao Ramesh), అలనాటి హీరోయిన్ అన్షు(Anshu) కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రవితేజ ‘ధమాకా’ మేకర్ త్రినాధరావు నక్కిన(Trinadha Rao Nakkina) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా(Rajesh Danda), ఉమేష్ కె ఆర్ బన్సాల్(Umesh KR Bansal) నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా(Balaji Gutha) సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్(Teaser) ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. ఇటీవల వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదలవుతూ హైప్ పెంచుతున్నాయి. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో రిలీజ్ కాబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం విడుదల కాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, మూవీ మేకర్స్ ‘మజాకా’ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ రితు వర్మ, సందీప్ కిషన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ‘‘ఈ శివరాత్రికి నవ్వు జాగారమే’’ అనే క్యాప్షన్ జత చేశారు.

Next Story