Idly Kadai: ధనుష్ సినిమా ‘ఇడ్లీ కడై’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం

by Ramesh Naini |

ప్రముఖ నటుడు హీరో ధనుష్ (Dhanush) తాజాగా నటిస్తున్న సినిమా 'ఇడ్లీ కడై' కోసం వేసిన సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

Idly Kadai: ధనుష్ సినిమా ‘ఇడ్లీ కడై’ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ నటుడు హీరో ధనుష్ (Dhanush) తాజాగా నటిస్తున్న సినిమా 'ఇడ్లీ కడై' కోసం వేసిన సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం (fire accident) చోటు చేసుకుంది. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘Idly Kadai’ సినిమా కోసం వేసిన సెట్‌లో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తేని జిల్లాలోని అండిపట్టిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సెట్‌లోని కీలక సామగ్రి కాలిపోయినట్టు సమాచారం. ఇక అగ్ని ప్రమాదం గురించి స్థానికులు అగ్నిమాపక విభాగానికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక విభాగం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అండిపట్టి ప్రాంత పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో షూటింగ్ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని సమాచారం.

కాగా, పాన్ ఇండియా తమిళ్ స్టార్ ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. చివరిగా ఆయన రాయన్ సినిమాలో కనిపించారు. దీని తర్వాత ‘నిలవుకు ఎన్మేల్ ఎన్నడి కోబం’ అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. అనంతరం ఆయన స్వీయ దర్శకత్వంలోనే ‘ఇడ్లీ కడై’ సినిమాలో నటిస్తున్నారు. డాన్ పిక్చర్స్ బ్యానర్ కింద ధనుష్, ఆకాష్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తోంది. సత్యరాజ్‌, రాజ్‌కిరణ్‌, ప్రకాష్‌రాజ్‌ సహా ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story