The Raja Saab: ప్రీమియర్స్ గందరగోళం గురించి నోరు విప్పిన మైత్రి శశి.. అంత ఇష్యూ జరిగిందా?

by Pulgam srinivas |

మైత్రి శశి మాట్లాడుతూ... ది రాజా సాబ్ ప్రీమియర్స్ విషయంలో తెలంగాణలో సమస్యలు ఎదుర్కోవడానికి ప్రధాన కారణం అప్పటికే దానిపై ఐదు కేసులు ఉండటమే అని స్పష్టత ఇచ్చాడు.

The Raja Saab: ప్రీమియర్స్ గందరగోళం గురించి నోరు విప్పిన మైత్రి శశి.. అంత ఇష్యూ జరిగిందా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ది రాజా సాబ్ చిత్రాన్ని ఈ సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పెయిడ్ ప్రీమియర్లను జనవరి 8వ తేదీ రాత్రి ప్రదర్శించనున్నట్లు మేకర్స్ మొదట ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూవీ ప్రీమియర్స్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు జారీ అయ్యాయి. దానితో అక్కడ ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే అసలు సమస్య మొదలయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియర్ షోలను ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం నుండి అనుమతులు రాలేదు. దాంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోల విషయంలో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది.

అభిమానులు థియేటర్ల వద్ద ఆందోళనలు సృష్టించారు. తెలంగాణ రాష్ట్రంలో ది రాజా సాబ్ ప్రీమియర్స్ ప్రదర్శన విషయంలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడిన ఆ సమయంలో దీనిపై ఎవరికీ పెద్దగా స్పష్టత లేకుండా పోయింది. తాజాగా మైత్రి శశి ఎందుకు ప్రీమియర్స్ విషయంలో అంత పెద్ద గందరగోళం నెలకొంది అనే దానిపై స్పష్టత ఇచ్చాడు. తాజాగా ఈయన ఓ సినిమా ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ... ఆ సమయంలో ఈ ఒక్క అంశం మీదే ఐదు కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. ఆ విషయం గురించి మాకు ఏమాత్రం తెలియదు. దాంతో ఆ కేసులన్నీ మేమే పరిష్కరించాల్సి వచ్చింది. శుక్రవారం సినిమా రిలీజ్ అనగా బుధవారం సాయంత్రం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది.

ఆ ఐదు కేసులు కొట్టివేసి ఆ తర్వాత అందుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ మా చేతికి వచ్చేసరికి రాత్రి అయింది. అది మా చేతికి వచ్చేవరకు మేము తెలంగాణ ప్రభుత్వాన్ని టికెట్ ధరల పెంపు విషయంలో కోరలేకపోయాం. బుధవారం రాత్రి మా చేతికి డాక్యుమెంటేషన్ రావడం వల్ల గురువారం ఉదయం మేము దరఖాస్తు చేశాం. అది షార్ట్ నోటీస్ కావడంతో ఆరోజు రాత్రి మాకు టికెట్ ధరల పెంపు జీవో వచ్చింది. స్టార్ హీరో సినిమా కావడం వల్ల మేము రిస్క్ తీసుకోలేకపోయాం. సాయంత్రం 7 గంటల నుండి ఐదు నిమిషాల్లో వస్తుందని చెబుతూనే ఉన్నారు, మేము ఏ నిర్ణయం సడన్గా తీసుకునే పరిస్థితుల్లో లేము. అందుకే ది రాజా సాబ్ ప్రీమియర్స్ విషయంలో పెద్ద స్థాయిలో గందరగోళం ఏర్పడిందని మైత్రి శశి తాజాగా చెప్పుకొచ్చాడు.

Next Story